Latest from the Blog
వృత్రుడి కథ
పూర్వం త్వష్టృ ప్రజాపతి దేవతలందరిలోకీ గొప్పవాడూ, గొప్ప తపస్సు చేసినవాడూనూ. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో మూడు తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టి చేశాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ, మూడు తలలతోనూ మూడు వేరువేరు పనులు చేస్తూంటే మునులందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేదపఠనం చేసేవాడు. మరొక నోటితో సోమపానం చేసేవాడు. మూడో ముఖంతో ప్రపంచంలో జరుగుతున్నదంతా గమనించేవాడు. అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటికాలి మీద; చలికాలం నీటిలోనూ, వేసవిలో అగ్నుల…
మహిషాసుర వధ
దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేశారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు. ఇంద్రుడు మొసలి రూపంలో పంచ నదంలో ప్రవేశించి, కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు. అప్పుడు అగ్ని ప్రత్యక్షమై, “ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా, పరమా?…
సుదర్శనుడి కథ
శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించమన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: కోసలదేశపు రాజధాని అయోధ్యా నగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆయనకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు సుదర్శనుడనీ, లీలావతికి శత్రుజిత్తు అనీ కొడుకులు కలిగారు. ధ్రువసంధి ఒకనాడు వేటాడుతూండగా సింహం ఒకటి అతని మీద పడింది. సింహము, ధ్రువసంధీ హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరూ చనిపోయారు. మనోరమ తండ్రి కళింగదేశపు రాజు వీరసేనుడు, తన అల్లుడు చనిపోయిన వార్తవిని…