రెండు విందులు

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.