నల దమయంతి

పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.